భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి పిట్టల శేఖర్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామానికి అందిస్తున్న సేవలను అభినందిస్తూ బుధవారం ఘనంగా సన్మానించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని వివిధ విఘ్నేశ్వర స్వామి మండపాల వద్ద పరిశుభ్రతను నిరంతరం కొనసాగించేందుకు కృషి చేస్తున్న పంచాయతీ సిబ్బందిని గణపతి ఉత్సవ నిర్వాహకులు సత్కరించారు.
మండపాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
గ్రామంలోని అన్ని విఘ్నేశ్వర స్వామి మండపాల పరిసరాలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచేలా పంచాయతీ సిబ్బందికి ఎప్పటికప్పుడు…






