భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడి గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో జరిగిన తోపులాటలో ఆయన కాలు, చేతికి గాయాలైనట్లు ఆయన వర్గీయులు తెలిపారు. చికిత్స అనంతరం హన్మకొండలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న దాస్యం వినయ్ భాస్కర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఎంజీఎం ఘటనలో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి వినయ్ భాస్కర్‌కు గాయాలైనట్లు పలు…