భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలో బుధవారం నుంచి కురిసిన వర్షానికి గురువారం తెల్లవారుజామున ఓ ఇల్లు కూలిపోయింది. నెల్లికుదురుకు చెందిన నిరుపేద గూడూరు ఆండాళ్లమ్మకు చెందిన పాత పెంకుటిల్లు గోడలు, పైకప్పు వర్షానికి కూలిపోయాయి.
తప్పిన పెను ప్రమాదం
ఇల్లు కూలిపోయే సమయంలో ఆండాళ్లమ్మ దంపతులు కూలిన ప్రాంతానికి దూరంగా ఉండటంతో ప్రమాదం తప్పింది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వర్షానికి ఇల్లు కూలిపోవడంతో నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకోలు
…






