భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అందరితో కలివిడిగా ఉంటూ గ్రామస్తులకు సుపరిచితుడైన 22 ఏళ్ల అభిషేక్ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మలిశెట్టి నగేష్, సుధ దంపతుల కుమారుడైన అభిషేక్ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడి మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

తల్లిదండ్రులకు తీరని శోకం

అభిషేక్ మూగవాడు కావడంతో ప్రాథమిక విద్య అనంతరం ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయినప్పటికీ తల్లిదండ్రులు అతడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అందరితో…