భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాల, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన శిక్షలు తప్పవని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్‌పర్సన్ ఎం. హేమలత హెచ్చరించారు. పిల్లల హక్కులు, వ్యక్తిగత భద్రత, లైంగిక వేధింపుల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా నర్సాపూర్‌లోని డాన్ బాస్కో స్కూల్‌లో POCSO చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ…






