భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుతూ మెదక్ జిల్లా పోలీస్ జట్టు సత్తా చాటింది. కరీంనగర్‌లో నిర్వహించిన ఇంటర్‌ జోనల్‌ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి జిల్లా పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకొచ్చింది. టోర్నీలో అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థి జట్లను ఓడించి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయానికి జట్టు ఆటగాడు సాయి కుమార్ బ్యాటింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 126, 84, 86 పరుగులు సాధించి అసాధారణ…