భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాబోయే గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ BRS శ్రేణులకు, పార్టీ బాధ్యులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు చొరవ తీసుకుని, వారికి అవసరమైన అవగాహన కల్పించాలని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న…






