భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో నీటి సంరక్షణకు శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ ముందడుగు వేశారు. గతంలో కురిసిన వర్షాలకు చెరువులో చేరిన నీరు వృథాగా బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. చెరువు మత్తడి వద్ద ఉన్న రంధ్రాల ద్వారా నీరు వృథాగా పోతున్నట్లు గుర్తించి, గ్రామస్తులతో కలిసి వాటిని పూడ్చివేయించారు. నీటి విలువను గుర్తించి సర్పంచ్ తీసుకున్న ముందస్తు చర్యలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మహబూబాబాద్ జిల్లా…