భారత్ సమాచార్, అగ్రికల్చర్ : వ్యవసాయం చేయాలంటే పొలం, మట్టి తప్పనిసరి అనుకుంటున్నారా? అయితే ఆధునిక సాంకేతికత ఆ ఆలోచనను మారుస్తోంది. నేల అవసరం లేకుండానే నీరు, పోషక ద్రావణాల సహాయంతో పంటలు పండించే విధానమే హైడ్రోపానిక్స్. పట్టణీకరణతో సాగుభూములు తగ్గిపోతుండటం, నీటి వనరుల వినియోగంపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ సాగు పద్ధతిపై రైతులు, ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి మేడలు, గ్రీన్‌హౌస్‌లు, పరిమిత స్థలాల్లోనూ దీన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
సాధారణ వ్యవసాయంలో మొక్కలు మట్టిలోని నీటి ద్వారా పోషకాలను గ్రహిస్తాయి.…



