భారత్ సమాచార్, ఉద్యోగం : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఐదు సంస్థలు, నియామక బోర్డుల నుంచి ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB), గోవా షిప్‌యార్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (JKSSB) మొత్తం 2,665 పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టాయి. వీటిలో డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీఐ, పదో తరగతి అర్హతలున్న అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి.
UPPSC సమీక్ష అధికారి, సహాయ సమీక్ష…






