భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైద్యాధికారులు డా. వి. భవాని, డా. ఇ. యేసు రాణి, డా. ఎం. శైలజారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో న్యుమోనియా వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు.

పీహెచ్‌సీలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన డా. భవాని మాట్లాడుతూ.. న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు సోకే వ్యాధి అని, ముఖ్యంగా…