భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న సీతానగరం మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధి నివారణ, నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డా. వి. భవాని కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు మధుమేహం గురించి వివరించారు.
ఈ సందర్భంగా డా. భవాని మాట్లాడుతూ.. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థాయిలో లేకుండా పెరగడం వల్ల మధుమేహం వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు…





