భార‌త్ సమాచార్, అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలో గురువారం ప్రారంభమైన 31వ CII పార్ట్‌నర్‌షిప్ సదస్సులో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో TDP, జనసేన, BJP కూటమి రెండున్నరేళ్లుగా ఎలాంటి విభేదాలు లేకుండా స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే…