భారత్ సమాచార్, హెల్త్ : చలికాలం వచ్చిందంటే చాలామందికి వరుస తుమ్ములు, ముక్కు కారడం, కళ్ల దురద, గొంతులో గరగర వంటి సమస్యలు మొదలవుతాయి. వీటిని చాలామంది సాధారణ జలుబుగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి అలర్జిక్ రైనైటిస్‌ లక్షణాలు కావచ్చు. చల్లని గాలి, ఇంట్లో పేరుకుపోయే దుమ్ము, డస్ట్‌ మైట్స్‌, పెంపుడు జంతువుల నుంచి వచ్చే అలర్జీ కారకాలు సమస్యను పెంచుతాయి. ముఖ్యంగా బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు, కార్పెట్లలో పేరుకునే సూక్ష్మ అలర్జీ కారకాల వల్ల ఉదయం నిద్రలేవగానే తుమ్ములు ఎక్కువగా…