భార‌త్ స‌మాచార్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం 2026-27 సంవత్సరానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సుమారు రూ.231.13 కోట్ల నిధుల వినియోగానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ…