భారత్ సమాచార్, సినిమా: శతాబ్దం పాటు సినీ రంగంలో తన ప్రతిభతో వెలుగొందిన అమెరికన్ నటి జూన్ లాకోర్ట్ (100) తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. 1925లో జన్మించిన జూన్, ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే నటిగా తొలి అడుగు వేసి, దాదాపు తొంభై ఏళ్లపాటు కళారంగంలో చురుగ్గా కొనసాగారు.
జూన్ లాకోర్ట్ నటనలో సహజత్వం, భావవ్యక్తీకరణ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆమె ‘లాస్సీ’, ‘లాస్ట్ ఇన్ స్పేస్’ వంటి ప్రసిద్ధ టెలివిజన్ సిరీస్‌లలో అద్భుత…

