భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ జలవనరులను కాలుష్యం నుంచి కాపాడాలని సూచించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమన్వయంతో రూపొందించిన పర్యావరణ పరిరక్షణ, మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్…