భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించారంటూ బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నెల్లికుదురు మండల శాఖ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యాదవ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్‌ను దూషించిన ఘటనపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తాతా…