భారత్ సమాచార్, వెబ్డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. వచ్చే ఏడాది IPL సీజన్లో ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియాన్ని వదిలి మహారాష్ట్రలోని పుణే స్టేడియంలో మ్యాచులు ఆడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరు నగరంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, స్టేడియం పరిసరాల్లో పెరుగుతున్న తొక్కిసలాట నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
క్రికెట్ వర్గాల ప్రకారం, ఆటగాళ్ల భద్రతతో పాటు ప్రేక్షకుల సౌకర్యం దృష్ట్యా ఈ మార్పు చేయాలని ఫ్రాంచైజీ తేల్చిందని…

