భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవం శ్రీ లింగమంతుల స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల ఇబ్బందులు ఇక తీరనున్నాయి. గ్రామ సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ సోమవారం రూ. 5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) నిధులతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యాదవుల కోరిక మేరకు ఆలయానికి సుగమమైన దారిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో వర్షాకాలంలో భక్తులు పడే అవస్థలు తొలగుతాయని…