భారత్ సమాచార్.నెట్: క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి (Religious Head) పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఏప్రిల్ 21 మరణించిన సంగతి తెలిసిందే. ఆయన స్ట్రోక్‌కు గురవడమేగాక, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్‌లోని వైద్య నిపుణులు (Vatican Doctors) వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు. ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. అయితే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో…