భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: జపాన్ రాజకీయ రంగంలో ప్రముఖ నేతగా నిలిచిన మాజీ ప్రధానమంత్రి టొమిచి మురయమా (Tomichi Murayama) శుక్రవారం కన్నుమూశారు. 101 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. “ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్”గా పిలువబడే మురయమా, తన నిష్ఠ, సరళత, మానవతా విలువలతో జపాన్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు.
1994లో అధికారంలోకి వచ్చిన ఆయన, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, న్యూ పార్టీ సాకిగకేతో కలసి కూటమి…

