భారత్ సమాచార్, అంతర్జాతీయం: అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్‌కు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటి వరకు H-1B వీసాలకు దరఖాస్తు ఫీజు $1500 ఉండగా, ఇకపై అది లక్ష డాలర్లుగా పెంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ పెంపు వెనుకున్న ఉద్దేశం అమెరికన్ యువతకు ఉద్యోగాల్లో పోటీ తగ్గించడం, వారికి స్థానికస్థాయిలో అవకాశాలు కల్పించడం. అంతేకాకుండా కొత్త ఫీజు విధానం తర్వాత H-1B వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై భారీ భారం పడనుంది.
…

