భారత్ సమాచార్, జాతీయం ;
హరియాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు 1,031 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాల్లో 2 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు భారీ సంఖ్యలో పోలీసుల బృందాలను మోహరించారు. చిన్న రాష్ట్రమే…



