భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టాలీవుడ్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి నటిగా, హోస్ట్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమా ర్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనదైన ముద్ర వేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే నిర్మాతగా ఆమె ప్రయాణం ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఊ కొడతారా ఉలిక్కి పడతారా, దక్ష వంటి చిత్రాలను నిర్మించినప్పటికీ, అవి…