భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి ఇప్పటికే 21 నెలలు దాటింది. నోటిఫికేషన్లు వచ్చినా ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తికాకపోవడంతో నిరుద్యోగుల్లో మళ్లీ నైరాశ్యం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలు ఆగమ్యగోచరంగా తయారయ్యాయి. పదేండ్ల తర్వాత వచ్చిన గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు.. గ్రూప్-2 రెండు సార్లు వాయిదా, గ్రూప్-4 జరిగినా ఫలితాలు ఎప్పుడిస్తారో తెలియదు.. గ్రూప్-3, డీఏవో, డీఎస్సీ తదితర పరీక్ష తేదీల ఊసే లేదు. ఇప్పటికే అష్టకష్టాలు పడుతూ…