భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తికి చెందిన ప్రముఖ గాయకుడు ఓరుగంటి మధు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వద్దిరాజు పేరులోని అర్థాన్ని, ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని చాటిచెప్పేలా రూపొందించిన ‘అక్షర కానుక’ ఫొటో ఫ్రేమ్‌ను ఎంపీకి బహూకరించారు. సుప్రసిద్ధ గాయకురాలు విమలక్క, సౌండ్ ఇంజనీర్ రవితో కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు.

అనంతరం, హన్మకొండ సుబేదారిలో త్వరలో ప్రారంభించనున్న ‘వి.ఆర్.సి’ రికార్డింగ్ స్టూడియో, డీజే సౌండ్స్ బ్రోచర్‌ను ఎంపీ వద్దిరాజు ఆవిష్కరించారు.…