భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend) ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 7న విడుదలై భావోద్వేగాలు, కథా పంథా, రష్మిక నటనతో విశేషంగా చర్చకు దారితీసింది. ‘భూమా’ పాత్రలో ఆమె ప్రదర్శన సినిమాకి ప్రధాన బలం‌గా నిలిచింది.

 

ఇప్పుడు ఈ చిత్రం చిన్నతెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిసెంబర్‌ 5న స్ట్రీమింగ్ ప్రారంభమవుతున్నట్లు సమాచారం.…