భారత్ సమాచార్.నెట్, అమరావతి: రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చెట్ల కింద ఆశ్రయం తీసుకోవద్దని అధికారులు సూచించారు.
మరిన్ని కథనాలు


