భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తీర్పును సవరించింది సుప్రీం ధర్మాసనం. షెల్టర్ హోమ్‌కు తరలించిన కుక్కలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రేబిస్ ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే మున్సిపల్ వార్డులల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణ కోసం పనిచేసే అధికారులకు ఎవరైనా అడ్డుతగిలితే వారిపై కఠిన చర్యలు…

