భారత్ సమాచార్, వెబ్డెస్క్: నేటి రాశిఫలాలు కింది విధంగా ఉన్నాయి.
మేషం: ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభం: ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.…

