భారత్ సమాచార్, వెబ్డెస్క్: ఉత్తర్ ప్రదేశ్ మిర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్లో ఘోర రైలుప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి వచ్చిన భక్తులు ఈ దుర్ఘటనకు గురయ్యారు. స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా నేతాజీ ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ప్రాథమిక వివరాల ప్రకారం, భక్తుల బృందం చోపాన్ ఎక్స్ప్రెస్ నుండి…

