భారత్ సమాచార్, జాతీయం: అస్సాంలో మళ్లీ ఉల్ఫా మిలిటెంట్లు హింసాకాండకు తెగబడ్డారు. తిన్సుకియా జిల్లా కాకోపతార్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్‌ను గురువారం అర్ధరాత్రి తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ట్రక్కులో వచ్చిన మిలిటెంట్లు గ్రెనేడ్లు విసిరి అనంతరం తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని భద్రతా వర్గాలు తెలిపారు. సుమారు ముప్పై నిమిషాలపాటు జరిగిన ఈ హఠాత్ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
దాడి అనంతరం ఉల్ఫా మిలిటెంట్లు చీకటిని ఆసరాగా చేసుకుని అడవుల దిశగా పారిపోయారు. వెంటనే ప్రతిక్రియ చూపిన భద్రతా బలగాలు సమీప గ్రామాలు,…

