భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీపీ రాధాకృష్ణన్ చేత శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి అబ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. మొత్తంగా 752 ఓట్లకు…

