భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ మున్సిపల్ పరిధిలో గురువారం (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని జీవహింసను, మాంసం విక్రయాలను పూర్తిగా నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అహింసా సిద్ధాంతాన్ని గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పరిధిలోని చికెన్, మటన్, చేపల దుకాణాదారులు ఎవరూ తమ దుకాణాలను తెరవకూడదని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ మాంసం విక్రయదారులు ఈ నిబంధనలను అతిక్రమించి దుకాణాలు…





