Homebreaking updates newsఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి

ఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ : బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి వ్యక్తుల గత చరిత్ర ఎలా ఉందో క్రెడిట్ స్కోర్ ద్వారానే తెలుసుకుంటాయి. దాని ద్వారానే అతడికి అప్పు ఇవ్వాలా? వద్దా అని నిర్ణయం తీసుకుంటాయి. పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా.. హోంలోన్ సహ ఇతర లోన్ లు తీసుకోవాలన్నా క్రెడిట్ స్కోరే కీలకమైంది. మరి తమ క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి బ్యాంకుల వద్దకు పరుగెత్తాల్సి వచ్చేది. లేదంటే బ్యాంకింగ్ యాప్స్ ను ఆశ్రయించాల్సి వచ్చేది.

తాజాగా ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే తన యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దీనిలో ‘క్రెడిట్’ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీంట్లో క్రెడిట్ స్కోర్ తో పాటు క్రెడిట్ హిస్టరీని ఉచితంగానే తెలుసుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్లు, రుణ వాయిదాల చెల్లింపుల వివరాలను కూడా ఈ ఫీచర్ తో సమర్థంగా మేనేజ్ చేసుకోవచ్చని ఫోన్ పే ప్రతినిధులు చెబుతున్నారు.

ఇలా చెక్ చేసుకోండి..

ఫోన్ పే యాప్ ను ఓపెన్ చేయగానే హోమ్ పేజీలోనే ‘క్రెడిట్’ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకుంటే.. యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. ‘క్రెడిట్’ పై క్లిక్ చేస్తే ‘క్రెడిట్ స్కోర్ ఫర్ ఫ్రీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కిందే ‘చెక్ నౌ’ అనే బటన్ పై క్లిక్ చేయాలి. వెంటనే క్రెడిట్ స్కోర్ మీకు కనిపిస్తుంది. ఈ స్కోర్ తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్ వినియోగ నిష్పత్తి, క్రెడిట్ ఏజ్, క్రెడిట్ మిక్స్, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు.

ఇక ఈ ఫీచర్ లో మేనేజ్ క్రెడిట్స్, లోన్ ప్రొఫైల్, పేమేంట్ డ్యూస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చిన ఫోన్ పే ప్రతినిధులు చెప్తున్నారు. అయితే ఫోన్ పే లో లాగిన్ ఫోన్ నంబర్.. పాన్ తో అనుసంధానమైన నెంబర్ ఒకటే అయి ఉండాలి.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ఇదో కొత్త రకం మోసం బాసు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments