భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారిని దీపికా పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ పంటలు వేయాలని సూచించారు. ప్రతి మండలానికి సరిపడే యూరియా బస్తాలు వెంటనే వెంటనే పంపిణీ చేస్తున్నామని అన్నారు. రైతులందరికీ అందుబాటులో యూరియా బస్తాలను అందజేస్తామని స్పష్టంచేశారు.
Share This Post


















