భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. వీరస్వామి, స్థానిక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎన్. శ్రీనివాసరావు కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు కుటుంబాల్లో కూడా అనేక సమస్యలు తలెత్తే…





