భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అర్థశాస్త్ర లెక్చరర్ డా. సుధాకర్, తెలుగు అధ్యాపకుడు దూపటి శ్రీనివాస్ సంయుక్తంగా ఉచితంగా విద్యా మెటీరియల్‌ను పంపిణీ చేశారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాధికారి సీహెచ్. మదార్ గౌడ్ చేతుల మీదుగా విద్యార్థులకు మెటీరియల్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యాధికారి మదార్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉచితంగా విద్యా మెటీరియల్ అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా అధ్యాపకులు సుధాకర్, శ్రీనివాస్…