భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్సై పి. నరేష్ సూచించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ మేరకు మండపాల నిర్వాహకులకు సూచనలు చేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలకు సంబంధించిన ప్రతిని ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని ఎస్సై తెలిపారు.…