భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బాణాల కలమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీసీసీ జిల్లా అధ్యక్షురాలు డా. భూక్య ఉమా మురళి నాయక్ మంగళవారం కలమ్మ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కలమ్మ కుమారులు బిక్షం, వెంకన్న, కుమార్తె బుజ్జమలను పరామర్శించి వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆపద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యాన్ని కోల్పోవద్దని,…





