భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలో సన్న వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వం అందిస్తున్న బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కేసముద్రం మార్కెట్ యార్డ్ కమిటీ ఇనుగుర్తి డైరెక్టర్ కొట్టం రాము సూచించారు. సన్న వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పొందేందుకు రైతులు సెప్టెంబర్ 10వ తేదీలోగా తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని మంగళవారం ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన సన్న వరి రకాలైన ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), బీపీటీ-5204 (సాంబా మసూరి), కేఎన్ఎం-1638,…





