భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడంతో పాటు వ్యవసాయం, కూరగాయల సాగుపై అవగాహన కల్పించేందుకు రాజాపేట మండలం దూది వెంకటాపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో కిచెన్ గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే వంకాయ, టమాటా, ఆకుకూరలు తదితర కూరగాయలను సాగు చేస్తూ విద్యార్థులకు వ్యవసాయంపై ప్రత్యక్ష అనుభవాన్ని కల్పిస్తున్నారు.
కిచెన్ గార్డెన్‌లో మొక్కలను నాటడం, వాటికి నీరు అందించడం, సంరక్షించడం, వాటి ఎదుగుదలను గమనించడం వంటి అంశాల్లో విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. దీనివల్ల కూరగాయల సాగు విధానంపై ప్రాథమిక…





