భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం నరసింహులగూడెంలో నిర్మించిన నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ కిసాన్ మోర్చా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు నల్లాని పాపారావు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. దంతాలపల్లిలో హుస్సేన్ నాయక్‌ను కలిసి సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయి ఏడాది గడిచినా ఇప్పటివరకు ప్రారంభించకపోవడంపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా నల్లాని పాపారావు మాట్లాడుతూ నరసింహులగూడెంలో నూతన సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడంతో రైతులు, స్థానిక ప్రజలు…





