భారత్ సమాచార్, న్యూఢిల్లీ: తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్ జూనియర్‌ను రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు. న్యూఢిల్లీలో బుధవారం ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల…

