భారత్ సమాచార్, ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నగలు, పనికిరాని వస్తువులను ప్యాకెట్లలో ఉంచినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో బ్యాంక్ మాజీ బ్రాంచ్ మేనేజర్ సహా ముగ్గురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మొత్తం 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించగా,…