భారత్ సమాచార్, అమరావతి: వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో తాను పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పర్చూరు నియోజకవర్గం పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. “చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయాయి.. మరో ఏడాది కూడా అలాగే గడిచిపోతుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నా పాదయాత్ర మొదలవుతుంది. పర్చూరు మీదుగా కూడా నా యాత్ర సాగుతుంది” అని…