భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: డీజేలకు దూరంగా.. సంప్రదాయ డప్పు వాయిద్యాలకు దగ్గరగా గణేష్ నిమజ్జన వేడుకలను నిర్వహిస్తూ కాచాపూర్ గౌడ యువ సేన యువకులు ప్రత్యేకంగా నిలిచారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో సంప్రదాయ డప్పు చప్పుళ్లకు విశేష ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.
ఇటీవల కాలంలో విపరీతమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న ఆధునిక డీజే సౌండ్ సిస్టమ్స్‌కు బదులుగా మన సంప్రదాయ డప్పు వాయిద్యాల వైపు భక్తులు మొగ్గు చూపుతున్నారనడానికి కాచాపూర్ గౌడ యువ సేన చేపట్టిన కార్యక్రమం…






