భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో నీటి సమస్యను ముందుగానే అధిగమించేందుకు నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఇంకుడు గుంతల ఆవశ్యకతను వివరిస్తూ ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో పొందుపరిచిన సందేశాలు, చిత్రాలు ప్రజలను ఆలోచింపజేసేలా ఉండటంతో చూపరులను…





