భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అణచివేతను ఎదురించి పోరాడిన ఐలమ్మ
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక అన్యాయాన్ని, అణచివేతను ఎదురిస్తూ ఆత్మగౌరవం, హక్కుల కోసం చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రతికూల…






